వేడినీరు తాగడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు..?
వేడి నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి చా మంచిది అని తెలుసు.కాని పరగడుపున తాగడం వల్ల ఆరోగ్యానికి ఏటువంటి లాభం కలుగుతుంది మరియు యేటువంటి నష్టం కలుగుతుంది అని తెలుసుకుందాం.
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-7021612129251260"
crossorigin="anonymous"></script>

వేడి నీటి ఆరోగ్య ప్రయోజనాలు :
- తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
- జలుబు మరియు అలర్జీల వల్ల వచ్చే సైనస్ రద్దీ నుండి ఉపశమనం పొందవచ్చు.
- తగినంత నీరు తాగడం వల్ల మీరు మరింత రిలాక్స్‌గా ఉండగలుగుతారు.
- ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.
- అధిక బరువు తగొచ్చు.
ఇలా మారేన్నో ఉపయోగాలు ఉన్నాయి.అందువలన చాలా మంది ఉదయాన్నే వేడినీలు తాగడం అలవాటుగా మార్చుకుంటున్నారు. అయితే పరగడుపున వేడినీరు తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు తో పాటు నష్టాలు కూడా తెలుసుకుందాం.
వేడినీరు తాగడం వల్ల కలిగే నష్టాలు :
జీర్ణ సంబంధ సమస్యలు :

పరగడుపున వేడి నీటిని తాగితే అది జీర్ణవ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, యాసిడ్ రిఫ్లక్స్, కడుపునొప్పి మొదలగు సమస్యలు వస్తాయి. కాబట్టి, ప్రతి రోజు వేడి నీళ్ళు తాగడం మంచిది కాదు.
డీహైడ్రేషన్..

వేడి నీళ్ళు తాగడం వల్ల. బాడీ కొన్ని పోషకాలు, ఖనిజాలను అబ్జార్బ్ చేయడంలో ఎఫెక్ట్ అవుతుందని కొందరు అంటున్నారు, అధే విధం గా వేడి నీళ్ళు యెక్కువ తాగడం వల్ల బాడీలో డీహైడ్రేషన్ పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి.
నిద్ర ఆటంకం :

పడుకునే ముందు వేడి నీటిని తాగడం వల్ల మీరు తరచుగా మేల్కునే అవకాశం ఉంది, అందువలన తర్వాత రోజు మీకు నీరసం మరియు బద్దకం గా అనిపించవచ్చు.
గొంతు మంట..

వేడిగా వున్నా నీళ్ళు ఖాళీ కడుపుతో తాగితే గొంతు అంత మంటగా వుండే అవకాశం వుంది. కొన్ని సార్లు మంట రోజు అంత వుంటుంది.
దంత సమస్యలు..

రెగ్యులర్‌గా వేడి నీరు తాగితే దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.వేడి నీరు తీసుకోవడం వల్ల మీ టేస్ట్ బాడ్స్ కూడా దెబ్బతింటాయి. దీనితో మనం కాసేపటి వరకూ ఏం తిన్నా వాటి టేస్ట్ తెలియదు.
ముగింపు :
తరచు మరి వేడి నీరు కాకుండా, కొద్దిగా గోరువెచ్చని నీరు తాగొచ్చు.దీనికోసం ముందుగా ఓ సిప్ చేసి నీటి వేడిని తెలుసుకొని తాగండి. అలా చెయ్యడం వల్ల ఏటువంటి సమస్య వుండదు.
గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాడం జరిగింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం గమనించగలరు.